విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీ చింతామణి గ్రామానికి చెందిన గిరిజనులు రహదారి వేసుకోవడంపై సినీనటుడు సోను సూద్ స్పందించి.. ఈ విషయం అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఈ రహదారి అక్కడ గిరిజనులకంటే పర్యాటకులకు మరింత సౌకర్యంగా మారింది. చింతామణి ఒడిశా సరిహద్దులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య ఉన్న రెండు గ్రామాల మధ్య లొద్ద అనే జలపాతం ఉంటుంది. సాలూరు మండలం నుంచి వాహనాల్లో వెళ్ళినా కూడా ఒకచోట వాహనాలను ఆపి ఎనిమిది కిలోమీటర్లు నడక నడిస్తే కానీ జలపాతం వద్దకు చేరుకోలేని పరిస్థితి. గిరిజనులు ఈ ప్రాంతంలో రహదారి వేయడం ఇక్కడకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
రోడ్డు వేసింది గిరిజనం... ఊపందుకుంది పర్యాటకం
విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయితీ చింతామణి గ్రామానికి చెందిన గిరిజనులు వేసిన రహదారి.. వారికంటే కూడా పర్యాటకులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్రామానికి ఆనుకొని ఉన్న జలపాతాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు.
గిరిజనులు వేసిన రహదారితో పర్యాటకులకు ప్రయోజనం
Last Updated : Sep 21, 2020, 3:50 PM IST