తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయానికి విజయనగరంలో విశేష స్పందన లభిస్తోంది. నగరంలోని తితిదే కల్యాణ మండపంలో శ్రీవారి లడ్డూల విక్రయానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 20 వేల లడ్డూలు కేటాయించారు. నేటి నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఉదయం 8.30 గంటలకు అమ్మకాలు ప్రారంభించగా.. అర గంటలోనే 2 వేల వరకూ అమ్ముడయ్యాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విక్రయాలు చేపడతామని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.