ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబోయ్​ పులి.. వణికిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు - కూలీలు

Tiger Roaming: బొబ్బిలి పారిశ్రామికవాడలో పులి సంచరిస్తోంది. ఉదయం పూట కూలీకి వెళ్లినవాళ్లు.. పులి పాదాల గుర్తులు చూసి భయంతో ఇళ్లకెళ్లిపోయారు. విషయం తెలుసుకుని అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పులి పాదముద్రల నమూనాలు సేకరించి.. రాత్రిపూట ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.

Tiger Roaming Vizianagaram District
విజయనగరం జిల్లాలో పులి సంచారం

By

Published : Sep 18, 2022, 9:06 PM IST

Tiger Roaming Vizianagaram District: విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పారిశ్రామికవాడ పంపు హౌస్ సమీపంలోని మెట్టవలస, భోజరాజు పురం ప్రాంతంలో పులి పాదముద్రికలు బయటపడ్డాయి. దీంతో కూలీలు, క్వారీల్లో పనిచేసే కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న ఆటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పాదముద్రల నమూనాలు సేకరించారు.

స్థానికులు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు అవగాహన కల్పించారు. రాత్రి పూట బయటకు వెళ్లకూడదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details