TIGER: విజయనగరం జిల్లా ఎస్.కోట పరిసరాల్లో పులి సంచారం గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎస్.కోటలోని జలగలబంద రహదారిపై పులిని చూసిన వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. కృష్ణాపురం శివారు భీమవరంలో రెండు గొర్రెలపై పులి దాడి చేసినట్లు స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించి పులి దాడిని నిర్దారించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారం గురించి పల్లెల్లో దండోరా వేయించారు.
పులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచన - విజయనగరం జిల్లా తాజా వార్తలు
TIGER: పులి పేరు చెబితినే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది పులిని రోడ్డు మీద చూస్తే ప్రాణభయంతో పరుగులు పెడతారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లా ఎస్.కోట పరిసరాల్లో జరిగింది. సమీప ప్రాంతాల్లో పులి సంచారం గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
విజయనగరం జిల్లా ఎస్.కోట పరిసరాల్లో పులి సంచారం