గజపతినగరంలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్రగాయాలు - గజపతినగరంలో రోడ్డు ప్రమాదం వార్తలు
కురుపాం గ్రామానికి చెందిన ఓ కుటుంబం నిశ్చితార్ధానికి వెళ్లి రాజమండ్రి నుంచి తిరిగి గ్రామానికి వస్తుండగా.. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగింది. ఏడుగురికి గాయాలయ్యాయి.

గజపతినగరంలో లారీని ఢీ కొన్న తుఫాన్ వాహనం
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కురుపాం గ్రామానికి చెందిన ఓ కుటుంబం నిశ్చితార్ధానికి వెళ్లి రాజమండ్రి నుంచి తిరిగి గ్రామానికి వస్తుండగా.. గజపతినగరంలో ఆగి ఉన్న లారీని.. తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.