విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో ఉన్న వేగావతి వంతెన వద్ద ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా...ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు సాలూరు సీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు సాలూరు మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ సూపర్వైజర్లుగా పని చేస్తున్నారని సమాచారం.
లారీని ఢీకొన్న కారు...ముగ్గురికి తీవ్ర గాయాలు - విజయనగరం తాజా వార్తలు
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
లారీని ఢీకొన్న కారు