ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతం... ఆస్పత్రి పాలైన ముగ్గురు వ్యక్తులు - కరెంట్ షాక్​తో ముగ్గురికి గాయాలు

విజయనగరం జిల్లా ఎస్​కోటలో... విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రి పాలయ్యారు. కేబుల్ వైరు బిగించడానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్తు​ షాక్​కు గురయ్యాడు. అతనికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

By

Published : Oct 22, 2019, 1:47 PM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్లిన టెక్నీషియన్... విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా ఎస్​కోటలో జరిగింది. కేబుల్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో... హైటెన్షన్ విద్యుత్తు వైరు తాకింది. ఈ ఘటనలో టెక్నీషియన్ కామేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details