ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GULAB EFFECT: గులాబ్ తుపాన్ బీభత్సం.. జిల్లాలో ముగ్గురు మృతి

గులాబ్ తుపాన్(gulab cyclone) విజయనగరం జిల్లాలో(vizianagaram district) బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్ ప్రభావంతో జిల్లాలో వివిధ మండలాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

gulab cyclone
gulab cyclone

By

Published : Sep 27, 2021, 4:23 PM IST

విజయనగరం జిల్లా(vizianagaram district)లో గులాబ్ తుపాన్ (gulab cyclone) బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్ ధాటికి ఇప్పటివరకు జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బొండపల్లి మండలం తమాటాడలో తుపాన్ ప్రభావానికి గోడ కూలి సుంకరి సూరమ్మ(70)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను విశాఖపట్నంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. వెదురువాడ పంచాయతీ గదబపేట గ్రామానికి చెందిన పిల్లి బురదయ్య(50) ఇంటి సమీపంలోని ధాన్యంపై ఉన్న టార్పాలిన్ పట్టాను సరి చేస్తుండగా పక్కనే ఉన్న చెట్టు పడి గాయపడ్డాడు. పెదమజ్జిపాలెం ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యలోనే బురదయ్య చనిపోయాడు. గుర్ల మండలం కోటగండ్రేడులో ప్రమాదవశాత్తు చెరువులో పడి గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి మరణించాడు.

ABOUT THE AUTHOR

...view details