ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరికొత్త హంగులతో.. మూడు లాంతర్ల స్తూపం పునర్నిర్మాణం - విజయనగరంలో మూడు లాంతర్ల స్తూపం

జాతీయ భావం పెంపొందించే రీతిలో గాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలు.. జాతీయ చిహ్నాలు. చీకట్లో మిరిమిట్లు గొలిపిలే లాంతర్ల ఏర్పాటు. వీటికి అనుసంధానంగా 20అడుగుల స్తూపం. కీర్తి, చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా కళారూపాలు. ఇన్ని విశిష్ఠతలున్న స్తూపం విజయనగరంలో ఉంది. గతంలో ఉన్న మూడు లాంతర్లకు మరింత శోభను చేకూర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Three-lantern stupa to enhance national sense in vizianagaram
సరికొత్త హంగులతో.. మూడు లాంతర్ల స్తూపం పునర్నిర్మాణం

By

Published : Jun 25, 2020, 10:56 PM IST

విజయనగరం మహా రాజులైన పూసపాటి గజపతుల వంశస్థులు ఈ మూడు లాంతర్లు స్తూపాన్ని నిర్మించారు. శతాబ్దాల కాలంగా విజయనగరం ప్రజలకు ఈ నిర్మాణం ఒక చారిత్రక చిహ్నంగాను, ఆ ప్రాంతం ముడులాంతర్ల కూడలిగా పేరుగాంచింది. శిథిలావస్థలో ఉన్న ఈ స్తూపాన్ని ఇటీవలే కూల్చి వేశారు. దాని స్థానంలో ఆధునిక హంగులతో స్తూపాన్ని పునర్నిర్మించారు. నూతనంగా నిర్మితమైన ఈ ఆధునిక మూడు లాంతర్ల స్థూపంపై స్వాతంత్ర సమర యోధులైన మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల పైభాగన మూడు సింహాలతో పాటు., మూడు లాంతర్లని అమర్చారు. ఇక దిగువున 20అడుగుల స్థూపాన్ని ఏర్పాటు చేసారు. దీనికి రంగురంగుల విద్యుత్తు దీపాలు అమర్చారు.

విజయనగరం.. ఇటీవలే నగర పాలక సంస్థగా అవతరించింది. అందుకు తగ్గట్టుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాల్లో భాగంగా మూడు లాంతర్లను ఆధునీకరించామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. నవీకరించిన మూడు లాంతర్లను బుధవారం విజయనగరం శాసనసభ్యులడు కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు.

ఆధునీకరించిన మూడు లాంతర్ల విశిష్ఠతలపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన నిర్మాణఆన్ని కూల్చివేసినప్పటికీ.. దాని ఔన్నత్యం తగ్గకుండా నూతన స్తూపాన్ని ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందని చెబుతున్నారు.

ఇదీచదవండి

కరోనా ప్రభావం.. మామిడి గుజ్జు పరిశ్రమ సంక్షోభం

ABOUT THE AUTHOR

...view details