విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. విజయనగరం డివిజన్లో మూడు నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో 248 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 207 స్థానాలలో 642 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విలీన వివాదాల కారణంగా గరివిడి, డెంకాడ మండలాల్లోని నాలుగు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2,330 వార్డుల్లో 610 వార్డుల అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1,720 వార్డుల్లో 5,239 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
పోలింగ్ నిర్వహణకు అధికారులు 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విడతలో 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. మూడో విడత ఎన్నికల గ్రామాల్లో 62 సమస్యాత్మక, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 82 రూట్ మొబైల్స్, 30 స్ట్రైకింగ్ ఫోర్స్, 30 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్లతో పాటు.. దాదాపు 3 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటింగ్లో పాల్గొంటున్నారు.
చీపురుపల్లి