భవిషత్తు తరాలకే కాకుండా... పర్యావరణ సమతుల్యానికి పెను సవాలుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు విజయనగరం నగరపాలక సంస్థ నడుం బిగించింది. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం సహా.. అలోహ సంచులు, సీసాలు, వ్యర్థ వస్తువులను అప్పగించిన వారికి మిఠాయి, కోడిగుడ్లు అందజేస్తోంది. ఈ వినూత్న కార్యక్రమాన్ని నగరంలోని రింగ్ రోడ్డు సమీపంలో.. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. నగరపాలక సంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇచ్చిన వారికి పావు కిలో మిఠాయి లేదా అరడజన్ కోడిగుడ్లు అందజేస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య అధికారిణి ప్రణీత, రోటరీక్లబ్ విజయనగరం అధ్యక్షుడు రవి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజా స్పందన ఆధారంగా దశల వారీగా నగర వ్యాప్తంగా అన్నీవార్డుల్లో దీన్ని విస్తరిస్తామని వారు తెలిపారు.
'ప్లాస్టిక్ ఇవ్వండి... బహుమతి గెలుచుకోండి' - The Vijayanagaram Municipal Corporation has launched an innovative program to reduce the use of plastic.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చిన వారికి పావు కిలో స్వీటు లేదా అరడజను గుడ్లు ఇస్తున్నారు.
విజయనగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం