విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ సీతానగరం మండలం సువర్ణముఖి నదిపై వేసిన మట్టి రోడ్డులో లారీ దిగబడింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్వతీపురం నుంచి ఒడిస్సాకు, విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో లారీలు బస్సులు ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి క్రేన్ సహాయంతో లారీని బయటికి తీశారు. రెండు గంటల అనంతరం వాహన రాకపోకలు పునరుద్ధరించారు.
రోడ్డుపై దిగబడిన లారీ.. నిలిచిన ట్రాఫిక్ - పార్వతిపురం నుంచి ఇటు ఒరిస్సాకు అటు విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం
తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డుపై లారీ దిగబడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురైంది. ఈ ఘటన విజయనగరం పార్వతీపురం ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది.
మట్టి రోడ్డుపై దిగబడి న లారీని బయటకు తీస్తున్న యంత్రాలు నిలిచిన వాహనాలు