సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ నీరుగారిపోతోంది. దీనికి నిదర్శనం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సచివాలయ అధికారుల తీరు. కురుకుట్టి సచివాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోగా.... ఉన్న ఒకే ఒక్క డిజిటల్ అసిస్టెంట్ నిద్రపోతున్నాడు.
అక్కడ సిబ్బంది ఉండరు... ఉన్నా వారు పనిచేయరు! - విజయనగరం జిల్లా వార్తలు
ఆ సచివాలయంలో ఒకే ఒక్క ఉద్యోగి ఉంటాడు... మరో సచివాలయంలో ఎవరూ ఉండరూ... ఇంకో చోట ఎంతమంది సిబ్బంది ఉన్నా పనిచేయరు... ఇది విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సచివాలయాల పరిస్థితి.
అంతేకాకుండా గంజాయిభద్ర పంచాయతీ సచివాలయాన్ని... గిరిశిఖర గ్రామమైన దూల బందరులోని ఓ అద్దె గృహంలో పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఫర్నిచర్ గానీ, కంప్యూటర్ గానీ పెట్టెల్లోంచి బయటకు తీయలేదు. ఈ సచివాలయంలో ఒకే ఒక్క ఏఎన్ఎం మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఆమె కూడా సచివాలయంలో ఉండకుండా....పీహెచ్సీలో సమావేశం ఉందని వెళ్లిపోయింది. ఇలాంటప్పుడు గిరిజనులకు అందుబాటులో ఎన్ని సచివాలయాలు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరే అవుతోందని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి:సాంకేతికత వినియోగంలో మేటి కానీ... పాలనలో పారదర్శకతలేదు