విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుంట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనమైంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వృద్ధురాలు జమ్మమ్మ (78) ఒంటరిగా ఉంటోంది. అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగటంతో.. ఆ సమయంలో అదే ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు సజీవ దహనమైంది. వెచ్చదనం కోసం పెట్టిన నిప్పుల కుంపటి వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వో శ్రీనివాసరావు బృందం సంఘటన స్థలానికి పరిశీలించారు. ఎస్ఐ వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటే ప్రాణం తీసింది... - fire accident at vizianagaram latest news update
వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటి ఆమెను సజీవదహనం చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుంట గ్రామంలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకోవటంతో వృద్ధురాలు సజీవ దహనమైంది. చలికాలం కావటంతో వెచ్చదనం కోసం పెట్టిన కుంపటి కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

వృద్ధురాలు సజీవదహనం