విజయనగరం జిల్లా భోగాపురం మండలం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుందర సామాజిక ఆసుపత్రిలో గత మూడేళ్ల క్రితం అంబులెన్స్ వాహనానికి చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చింది. అప్పటినుంచి మరమ్మతులు చేయకుండా అలానే వదిలేశారు. ఇప్పుడు ఈ వాహనం ఎందుకు పనికి రాకుండాపోయింది. ఇదే విషయం విజిలెన్స్ తనిఖీల్లోనూ బయటపడింది. ఇలా చేసినందుకుగాను సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక పథకాలు మూలనపడుతున్నాయని పలువురంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..మూలకు చేరిన వాహనం - vigilance checkings
ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో పలు పథకాలు మూలకు చేరుతున్నాయి. సమస్య చిన్నదైనా మాకెందుకులేనని పట్టించుకోకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.

అవసరాన్ని అణగ ధొక్కారు.. అధికారిపై చర్యలు తప్పవన్నారు
Last Updated : Jun 6, 2020, 1:04 PM IST