విజయనగరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిబిరాన్ని జాతీయ కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ ప్రారంభించారు. దేశంలోని 727 జిల్లాల్లో దశల వారీగా కమిషన్ శిబిరాలు నిర్వహిస్తుందని,బాలల హక్కుల కోసమే ఎన్సీపీసీఆర్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 3వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, ఇందులో ఎక్కువగా విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలే ఉన్నాయన్నారు. జాతీయ కమిషన్ నిర్వహించే శిబిరాన్ని ఆశ్రయిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి, బాధితునికి వెంటనే న్యాయం చేస్తామని తెలియచేశారు. బాలల హక్కులకు ఎక్కడైన ఉల్లంఘన జరిగినట్లు అనిపిస్తే, వెంటనే 1098 కు ఫోన్ చేయాలని లేదా జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను సంప్రదించవచ్చని ఆనంద్ చెప్పారు. ఈ శిబిరంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ , రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షురాలు హైమావతి, సభ్యులు అప్పారావు, కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా తదితురులు పాల్గొన్నారు.
బాలల హక్కుల ఉల్లంఘనలపై 1098 కు ఫోన్ చేయండి - Vijayanagaram district.
బాలల హక్కుల పరిరక్షణకై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో శిబిరాలను నిర్వహిస్తోంది. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

The National Child Rights Protection Commission conducts camps in in Vijayanagaram district
పిల్లలు మీ సమస్యలు చెప్పండి..ఎన్సీపీసీఆర్