ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధమే కారణమైంది.. అడ్డొచ్చాడని హతమార్చింది..! - punnapureddypeta latest news

పేగు తెంచుకుని పుట్టకపోయినా... కన్న కొడుకులా పెంచుకుంది. కొన్నేళ్లకు తన కడుపు పండటంతో... పెంపుడు కొడుకుపై మమకారం తెంచేసుకుంది. వివాహేతర బంధాన్ని పసిగట్టడంతో... అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్త, సొంత కుమారుడికి లేనిపోనివి నూరిపోసింది. మరో ఇద్దరితో కలిసి... దత్త పుత్రుడిని అత్యంత పాశవికంగా హతమార్చింది. అమ్మ అనే మాటకే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ దారుణ ఘటన... విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది.

The mother killed the adopted son
దత్తపుత్రుడిని చంపించిన తల్లి

By

Published : Apr 17, 2021, 8:09 AM IST

Updated : Apr 17, 2021, 8:22 AM IST

అక్రమ బంధానికి అడ్డు వస్తున్నాడని.. దత్తపుత్రుడిని చంపించిన తల్లి

వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడంటూ పెంపుడు కొడుకుని హత్య చేయించిన మహిళ ఉదంతం... విజయనగరం జిల్లాలో సంచలనం రేపింది. తన గుట్టు బయటకు రాకుండా, ఇంట్లో వాళ్లను, వివాహేతర బంధం పెట్టుకున్నవాడిని ఉసిగొల్పి... దత్తపుత్రున్ని కిరాతకంగా చంపేసిన మహిళను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టుచేసి, రిమాండ్‌కు పంపారు.

పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే..

జిల్లాలోని గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకు చెందిన సత్యం, సీతమ్మ దంపతులకు కొన్నేళ్లపాటు సంతానం కలగలేదు. ఇక పిల్లలు పుట్టరనుకుని... సత్యం తమ్ముడు కుమారుడు ప్రసాద్‌ను దత్తత తీసుకున్నారు. ఆప్యాయంగా చూసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత... వారికో పిల్లాడు పుట్టాడు. సొంత కొడుకుపై మమకారం పెంచుకున్న దంపతులు... అప్పటిదాకా ప్రేమగా చూసుకున్న ప్రసాద్‌ను నిర్లక్ష్యం చేశారు. చదివించకుండా పొలం పనులకే పరిమితం చేశారు. ఈ క్రమంలోనే గ్రామంలోని రామారావు అనే వ్యక్తితో సీతమ్మకు ఉన్న వివాహేతర బంధం... ప్రసాద్‌కు తెలిసింది. అది పద్ధతి కాదంటూ తల్లిని హెచ్చరించాడు. సహించలేకపోయిన సీతమ్మ.... ఎలాగైనా ప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రసాద్‌పై భర్త సత్యం, సొంత కుమారుడు రమణకు పితూరీలు చెప్పింది. అతడు బతికి ఉంటే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని... అడ్డు తొలగించుకుంటే ఏ గొడవ ఉండదని నచ్చజెప్పింది. వివాహేతర బంధం పెట్టుకున్న రామారావును తోడు తెచ్చుకుంది. అలాగే ఆస్తిలో కొంత ఇస్తామంటూ మేనల్లుడు యడ్ల రాంబాబును తమతో కలుపుకొంది. గత నెల 16న చీపురుపల్లి జాతరకు వెళ్లి వచ్చి, పశువుల పాకలో నిద్రిస్తున్న ప్రసాద్‌ను... మిగిలిన నలుగురితో కలిసి అంతం చేసింది.

ఇదీ చదవండి:జుత్తాడ మృతుల అంత్యక్రియలు పూర్తి

హతమార్చి.. ఏమీ తెలియనట్టు..

అతి కిరాతకంగా, పాశవిక పద్ధతిలో ప్రసాద్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాళ్లూచేతులు తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ వేసి... ఊపిరాడకుండా చేసి ప్రసాద్‌ను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ప్రసాద్‌ చనిపోయాడని నిర్ధరించుకున్నాక, బైక్‌పై మృతదేహాన్ని నెల్లిమర్ల మండలం వెంకన్నపాలెం తరలించిన సీతమ్మ బ్యాచ్.... అక్కడి జగ్గునాయుడు చెరువులో పడేసి, ఏమీ తెలియనట్టు ఇంటికి తిరిగొచ్చారు. గ్రామంలో ఎవరికీ అనుమానం రాకుండా... ప్రసాద్‌ వ్యసనపరుడని, చీపురుపల్లి జాతరకు వెళ్లి తిరిగి రాలేదని ప్రచారం చేశారు. అప్పుడప్పుడూ అలా వెళ్లిపోతుంటాడని నమ్మించారు. అయితే జగ్గునాయుడు చెరువులో లభించిన యువకుడి మృతదేహం గుర్తుతెలియనిదిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు... అనూహ్యంగా తీగ దొరికింది. ప్రసాద్‌ కనిపించడం లేదంటూ సొంత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు, వారు పోలీసులకు అందజేసిన ఫొటో, దత్తపుత్రుడు కనిపించకపోయినా పట్టించుకోని సీతమ్మ, సత్యం అనుమానాస్పద వైఖరి ఆధారంగా లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్ర కథ బయటికొచ్చింది.

ఇదీ చదవండి:

వైరల్: సీఐ వేధించాడంటూ వ్యక్తి ఆత్మహత్య

Last Updated : Apr 17, 2021, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details