ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చారిత్రక కట్టడమని నిరూపించండి.. రాజీనామా చేస్తా' - three lanterns news vijayanagaram

విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షన్ లో నూతన నిర్మాణానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు.. మూడు లాంతర్ల విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

The MLA  laid the foundation for the three lanterns
మూడు లాంతర్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

By

Published : May 24, 2020, 6:24 PM IST

విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షన్​లో కూల్చివేతపై ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పందించారు. పట్టణాన్ని కార్పొరేషన్ స్థాయికి ఎదిగేలా చేసేందుకు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే.. మూడు లాంతర్ల జంక్షన్ వద్ద నూతన నిర్మాణాన్ని చేపట్టేందుకు శంకుస్థాపన చేశామన్నారు.

మాజీ మంత్రి అశోక గజపతిరాజు.. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. మూడు లాంతర్లను.. చారిత్రక కట్టడమని.. పురాతన కట్టడమని ఆయన నిరూపిస్తే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details