విజయనగరం జిల్లా పార్వతీపురంలో గతేడాది నవంబర్‌లో మార్కెట్ యార్డ్ సమీపంలో లారీ చోరీకి గురైంది. సీసీ ఫుటేజి సహాయంతో దర్యాప్తు చేయగా శ్రీకాకుళం జిల్లాలో లారీని గుర్తించినట్లు సీఐ దాశరథి తెలిపారు. టెక్కలికి చెందిన కిషోర్ అనే వ్యక్తి లారీని దొంగిలించాడన్నారు. అప్పటికే లారీకి సంబంధించి నాలుగు చక్రాలు విక్రయించాడని, నిందితుడిపై గతంలో మినీ బస్సు, వ్యాను చోరీ చేసిన కేసులు ఉన్నాయన్నారు. కిషోర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ - lorry theft man arrested by the police news update
మూడు నెలల క్రితం లారీని చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో మినీ బస్సు, వ్యాను చోరీ చేసిన కేసులున్నట్లు సీఐ దాశరథి తెలిపారు.
![పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ lorry theft man arrested by the police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6067176-422-6067176-1581664884171.jpg)
పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్ చేసిన పోలీసులు
పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇవీ చూడండి...