విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పట్నాయక్ వలస గ్రామానికి చెందిన ఓ గర్భిణికి నొప్పులు రావటంతో..సాలూరు సీహెచ్సీకి తరలించారు. ఈ ఆస్పత్రిలో ప్రసవం చేయటం కష్టమని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. 108 వాహనంలో విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా...బొండపల్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్దకు వచ్చేసరకి నొప్పులు ఎక్కువ అయ్యి...వాహనంలోనే ఆమె ప్రసవించింది. ఆడపిల్ల పుట్టింది. అనంతరం తల్లీ, బిడ్డను విజయనగరం ఆస్పత్రిలో చేర్పించారు.
అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం
అంబులెన్స్‌లో గర్భిణీ ఆడ శిశువుకి జన్మనిచ్చిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే...
అంబులెన్స్‌లోనే ప్రసవం