తల్లి మరణించిన గంట వ్యవధిలోనే కుమారుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురంలో జరిగింది. గ్రామానికి చెందిన అచ్చమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందగా..తల్లి మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చిన ఆమె కుమారుడు దేముడు(50) అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దేముడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తెకు అక్టోబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. వివాహం సమీపిస్తుండగా తండ్రి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తల్లి మృతి చెందిన గంట వ్యవధిలోనే... - విజయనగరం మరణ వార్తలు
తల్లి మరణించిన గంట వ్యవధిలోనే... ఆమె చనిపోవటాన్ని జీర్ణించుకోలేని కుమారుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో జరిగింది.
విజయనగరం జిల్లాలో విషాదం
Last Updated : Sep 13, 2020, 6:11 PM IST