ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 2, 2021, 11:33 PM IST

ETV Bharat / state

సచివాలయ కార్యదర్శిపై కార్పొరేటర్ భర్త దాడి

కార్పొరేటర్ భర్త తనపై దాడి చేశారని సచివాలయ కార్యదర్శి ఆరోపించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ఘటనలో తన తప్పు లేనప్పటికీ వార్డు సచివాలయ కార్యదర్శి బాధ్యతల నుంచి తనను సస్పెండ్ చేయించారని దుర్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

durgareddy
దుర్గారెడ్డి

మిందు దుర్గారెడ్డి

విజయనగరంలోని 45వ డివిజన్ కె.ఎల్.పురం కార్పొరేటర్ భర్త తాళ్ల గణేష్... తనపై దాడి చేసినట్లు 55 వార్డు సచివాలయ కార్యదర్శి మిందు దుర్గారెడ్డి ఆరోపించారు. నేటి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో సక్రమంగా స్పందించలేదంటూ తనపై దుర్భాషలాడి, దాడి చేశారని దుర్గారావు తెలిపారు. ఈ మేరకు కార్పొరేటర్ భర్తపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశామన్నారు.

ఘటనలో తన తప్పు లేనప్పటికీ వార్డు సచివాలయ కార్యదర్శి బాధ్యతల నుంచి తనను సస్పెండ్ చేయించారని దుర్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగిపై కార్పొరేటర్ భర్త చేయి చేసుకోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.తనకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి చేరే వరకు పోరాడుతానన్నారు. సచివాలయ సిబ్బందికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

ఆ అధికారి అందరికీ ఆదర్శం..ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details