ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, బైక్​ను ఢీకొట్టి.. ఆపకుండా పరార్! - జీగిరం రోడ్డు ప్రమాదం

ఆటోతో పాటు బైక్​ను ఢీకొట్టాడు. ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా అది ఒడిశా రిజిస్ట్రేషన్​గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

జీగిరం రోడ్డు ప్రమాదం
జీగిరం రోడ్డు ప్రమాదం

By

Published : Nov 23, 2021, 10:25 PM IST

ఒడిశా నుంచి విశాఖపట్నం వెళుతున్న OR10H 2780 నెంబర్ గల కారు బీభత్సం సృష్టించింది. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం జీగిరం గ్రామం దగ్గర బైక్​తో పాటు.. స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో వాలంటీర్ భాస్కరరావు కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అనిషా పరిస్థితి విషమంగా ఉంది. ఆ బాలికను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details