విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఏజెన్సీలో ప్రమాదం తప్పింది. దేరువాడ నుంచి బీరుపాడు, గొయ్యిపాక గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం పక్కనే పెద్ద బండరాళ్లు ఉన్నాయి. వాటిల్లోని ఓ పెద్ద బండరాయి జారి రహదారిపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా జనసంచారం, వాహనాలు రాకపోకలు లేవు. కానీ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే ఈ రహదారే ప్రధానమైందని గిరిజనులు చెబుతున్నారు.
ఏజెన్సీలో తప్పిన ప్రమాదం - విజయనగరం జిల్లా వార్తలు
విజయనగరం జిల్లాలోని దేరువాడ నుంచి బీరుపాడు, గొయ్యిపాక గ్రామాలకు వెళ్లే రహదారిపై పెద్ద బండరాయి పడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
![ఏజెన్సీలో తప్పిన ప్రమాదం stone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6876502-686-6876502-1587463091402.jpg)
stone