ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన - భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

The AP government will lay the foundation stone for the Bhogapuram airport in February
భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన

By

Published : Jan 16, 2021, 9:29 AM IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మించనుంది. మెుత్తం 2,203 ఎకరాల్లో అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వంతో రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించటానికి 15 మంది సభ్యులతో కమిటీని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) ఏర్పాటు చేసింది. ఇంకా 120 ఎకరాలను సేకరించాల్సి ఉందని..దీన్ని జనవరిలో పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తారని ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్​రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details