విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి పాలకొండ వెళ్తున్న బస్సు నుంచి ఆయిల్ ట్యాంక్ విడిపోయి రోడ్డుపై పడింది. కొద్ది దూరం ట్యాంక్ రోడ్డుపై గీసుకుంటూ వెళ్లింది. డ్రైవర్‌తో పాటు అందరూ అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆయిల్ ట్యాంక్ బోల్టులు ఊడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. డిపో మేనేజర్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
బస్సు నుంచి విడిపోయిన ఆయిల్ ట్యాంక్...తప్పిన ప్రమాదం - పార్వతీపురంలో బస్సు నుంచి విడివడిన ఆయిల్ ట్యాంక్
విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
![బస్సు నుంచి విడిపోయిన ఆయిల్ ట్యాంక్...తప్పిన ప్రమాదం The accident occurred on the road after the oil tanker broke free from the bus.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6163872-738-6163872-1582363733824.jpg)
పార్వతీపురంలో బస్సు నుంచి విడివడిన ఆయిల్ ట్యాంక్