విజయనగరం జిల్లా సాలూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ డిపో సరకులను తాహసీల్దార్ పట్టుకున్నారు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమాచారంతో గుడి దగ్గర రేషన్ డిపోలో తనిఖీలు నిర్వహించారు. ఆలూరు పట్టణం మీదుగా వారణాసి గోపి అనే వ్యక్తి దగ్గర సరుకులు ఇక్కడి నుంచి ఒడిశాకు.. అక్కడి నుంచి సాలూరుకు ఎగుమతి, దిగుమతులు చేస్తున్నట్టు గుర్తించారు. సదరు వ్యక్తి దగ్గర ఎలాంటి రికార్డులు లేకపోవడంపై కేసు నమోదు చేశారు. నిందితుడికి సంబంధించి రెండు గోదాముల్లో తనిఖీలు నిర్వహించగా ఉన్నంత మేరకు లెక్కలు రాసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తాహసీల్ధార్ ఇబ్రహీం పేర్కొన్నారు.
అపరిచిత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. అక్రమార్కుడు అరెస్ట్ - ration at vizianagaram news
విజయనగరం జిల్లా సాలూరులో రేషన్ సరకులు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు, అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గోదాముల్లో తనిఖీలు చేసిన తహసీల్దార్.. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ కలెక్టర్ ఎదుట ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.
రేషన్ డిపోలో తాహసీల్ధార్ తనిఖీలు