విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొఠియా వివాదాస్పద గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆంధ్రా పరిషత్ ఎన్నికల సమయంలో ఆయా గ్రామాల్లో ఒడిశా పోలీసుల హడావిడి మరోసారి కనిపించింది. కొఠియా, ఎగువశించి ప్రాంతంలోనూ, అటు పగులుచెన్నూరు, పట్టుచెన్నూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. పలు ప్రాంతాల్లో వైఎస్సార్ క్రాంతి పథం సిబ్బంది పలు కార్యక్రమాలు చేపట్టారు.
అదే సమయంలో ఒడిశా కలెక్టర్, ఎస్పీ పర్యటన ఉందంటూ.. కొరాపూట్ జిల్లా యంత్రాంగం క్రాంతి పథం కార్యక్రమాలను, ఆంధ్రా అధికారులను గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు.
అసలు విషయం ఏంటంటే!
ఏపీ - ఒడిశా రాష్ట్రాల్లో సరిహద్దులో కొఠియా గ్రూప్లో 23 గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల విభజన సమయంలో తలెత్తిన వివాదం నేటికీ కొనసాగుతోంది. ఈ గ్రామాలపై ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో.. స్టేటస్ కో విధించింది. అయితే.. అభివృద్ధి పేరుతో ఈ గ్రామాల్లో ఆధిపత్యం చలాయించేందుకు ఇరు రాష్ట్రాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, పార్వతీపురం ఐడీటీఏ పీవో లక్ష్మీ 2018 జనవరిలో కొఠియాలో పర్యటించి జన్మభూమి- మాఊరు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటినుంచి ఆంధ్ర అధికారులు కొఠియాకు వెళ్తున్నారని తెలిస్తే చాలు.. ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు నిరసనలకు దిగుతున్నారు.
ఇదీ చదవండి:
కత్తిసాములో "అరుంధతి"..! కర్రసాములో "దేవసేన"..!!