చలో రామతీర్థానికి బయల్దేరిన భాజపా - జనసేన శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఇరు పార్టీల నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా, తెదేపా నేతలను అనుమతించి.. తమను ఎందుకు పంపించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఎంతకూ పోలీసులు వారిని అనుమతించకపోవడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, భాజపా నేతల మధ్య తోపులాట జరిగింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా.. రామతీర్థం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
చలో రామతీర్థం: తోపులాటలో సొమ్మసిల్లిన వీర్రాజు, విష్ణు
విజయనగరం జిల్లా రామతీర్థానికి బయల్దేరిన భాజపా, జనసేన నేతలను... నెల్లిమర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను ఆలయానికి అనుమతించాల్సిందే అని నేతలు పట్టుబట్టగా.. పోలీసులు అంగీకరించలేదు. అక్కడ.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
చలో రామతీర్థం: తోపులాటలో సొమ్మసిల్లిన వీర్రాజు, విష్ణు
Last Updated : Jan 7, 2021, 1:56 PM IST