ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుకుట్టిలో 198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు - vizianagaram tribal ashram school

విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని కురుకుట్టి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ పాఠశాలలో 3,4,5 తరగతుల్లో మొత్తం 198 మంది విద్యార్థునులు చదువుతున్నారు. ఇంత మందికి ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. అందరికీ ఒకేసారి చెప్పలేక... ఇక్కడున్న టీచర్ కష్టపడుతుంటే... సిబ్బంది కొరత కారణంగా విద్యార్థునులు నష్టపోతున్నారు.

198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు

By

Published : Sep 28, 2019, 6:33 AM IST

198 మంది విద్యార్థునులు... ఒకే ఉపాధ్యాయుడు

ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉంటడం చాలా సందర్భాల్లో చూశాం. కానీ విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టి బాలికల ఆశ్రమ పాఠశాల పరిస్థితి భిన్నంగా ఉంది. 189 మంది విద్యార్థునులుండగా... ఒకేఒక్క ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. ఫలితంగా చిన్నారులను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు.

అటు పాఠాలు చెప్పలేక ఉపాధ్యాయుడు... ఇటు చెప్పేవారు లేక విద్యార్థునులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది లేకపోవడం కారణంగా... పాఠశాలలో ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సాలూరు పరిధిలోని చాలా గ్రామాల్లో పిల్లలు లేక స్కూళ్లు మూసివేసే పరిస్థితి ఉంది. అక్కడి ఉపాధ్యాయులను తమ పాఠశాలకు పంపాలని ఆశ్రమ పాఠశాల విద్యార్థునులు కోరుతున్నారు..

ఇదీ చదవండీ... వివేకా హత్యకేసు... మరో మలుపు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details