కళాశాల అధ్యాపకుడు.. వందసార్లు రక్తదానం చేశాడు.. - విజయనగరంలో 100 సార్లు రక్తదాన చేసిన అధ్యాపకుడు
రక్తదానంలో.... విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల అధ్యాపకుడు గుప్త సెంచరీ కొట్టారు. 1993లో తొలిసారి రక్తదానం చేసిన ఆయన అప్పటి నుంచి ఎవరికి రక్తం అవసరమని తెలిసినా నేనున్నానంటూ ముందుండేవారు. ఏటా సరాసరిన 4 సార్లు రక్తదానం చేసేవారు. గత సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా... విజయనగరం ప్రాంతీయ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో వందోసారి రక్తదానం చేశారు. ఆసుపత్రి వైద్యులు, రక్తనిధి కేంద్రం అధికారులు గుప్తను అభినందించారు.