విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి విద్యార్థిని (16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్ మాస్టారు కన్నేశాడు. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె గర్భవతి అని, ఎనిమిదో నెల అని వైద్యులు తెలిపారు. వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. ఇతడికి అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్ చెబుతున్నాడని చెప్పారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు.
rape on girl : మేధాశక్తిని పెంచుతానని గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టారు - vizianagaram district crime
తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన ఓ బాలికను ట్యూషన్ మాస్టారు గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు.
మేధాశక్తిని పెంచుతానని గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టారు
Last Updated : Sep 23, 2021, 8:20 AM IST