మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ మార్పుపై కేసు నడుస్తుండగానే.. ప్రభుత్వం సంచయితకు అనుకూలంగా జీవోలు జారీ చేయటం ఏంటని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. విశాఖ, విజయనగరంలో భూముల ఆక్రమణ లక్ష్యంతోనే సంచయితను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. గజపతి అనే ఇంటిపేరును కేవలం తన పరపతి కోసమే వాడుకుంటూ సంచయిత దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ మార్పుపై కేసు నడుస్తుండగానే జీవోలా?: అనిత - తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత న్యూస్
మాన్సాస్ ట్రస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. సంచయిత గజపతిరాజుకి దొంగ దారిలో అర్ధరాత్రి జీవో ఇచ్చి ఛైర్పర్సన్ను చేశారన్నారు. ట్రస్టు భూములను వైకాపా నేతలు దోచుకోవడానికే సంచయితను తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
tdp women president