వైకాపాకు అమరావతి అంటే ఎందుకంత ద్వేషమని తెదేపా జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నమనాయుడు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలసలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని మండిపడ్డారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి నేడు మూడు రాజధానులు తెరపైకి తేవడం సరికాదన్నారు. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'అమరావతి అంటే వైకాపాకు ఎందుకంత ద్వేషం?'
3 రాజధానులు అంటూ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని తెదేపా నేతలు విమర్శించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలసలో జరిగిన సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నమనాయుడుతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
రెల్లివలసలో తెదేపా సమావేశం