ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లావ్యాప్తంగా తెదేపా నిరసన దీక్షలు - Tdp leaders protest chipurupally

పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రస్తుత విద్యుత్ బిల్లుల విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Tdp protests throughout Vijayanagar district
నిరసన చేపట్టిన తెదేపా నేతలు

By

Published : May 21, 2020, 11:50 PM IST



విజయనగరం జిల్లా పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిన జగన్... క్లిష్ట సమయంలో వినియోగదారులపై అధిక భారాన్ని మోపి మాట తప్పారని నాయకులు ఆరోపించారు.

శృంగవరపుకోటలో...

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో మాజీఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంట్లోనే నిరసన దీక్ష చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా ఛార్జీల భారం మోపడం దారుణమన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు.

చీపురుపల్లిలో...

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా మండల ఆధ్యక్షుడు రౌతు కామునాయుడు నిరసన దీక్ష చేపట్టాడు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని... లేకుంటే ప్రభుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:విజయనగరం నుంచి.. రోడ్డెక్కిన బస్సులు

ABOUT THE AUTHOR

...view details