ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగాయి' - ashok-gajapathi-raju-respond-on-ramatheertham-statue-incident

ఎంతో ఘన చరిత్ర ఉన్న విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విజయనగరం తెదేపా కార్యాలయంలో అశోక్ గజపతిరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు.

tdp-polit-bureau-member-ayyannapathrudu-ashok-gajapathi-raju-respond-on-ramatheertham-statue-incident
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు

By

Published : Dec 31, 2020, 5:19 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి స్పందించకపోవడం దారుణం అని అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగితే డీజీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలను ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని అయన్నపాత్రుడు మండిపడ్డారు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు బాధాకరమని అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడు, సీతాదేవీ, పాండవులు సంచరించిన పుణ్యస్థలమైన రామతీర్ధాల చరిత్ర ఆధారంగా స్థానికులు నాలుగు వందల ఏళ్లుగా దేవాలయ పవిత్రతను కాపాడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం విచారకరమని అశోక్​ గజపతిరాజు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details