ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో 'రైతుల కోసం తెదేపా' పాదయాత్ర - రైతుల కోసం తెదేపా పాదయాత్ర

విజయనగరం జిల్లా పార్వతీపురంలో రైతు కోసం తెదేపా పాదయాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తాళ్ల బురిడి కూడలి నుంచి లచ్చి రాజు పేట వరకు పాదయాత్రగా వెళ్లి రైతు కష్టాలు తెలుసుకున్నారు.

tdp Padayatra for farmers
రైతుల కోసం తెదేపా పాదయాత్ర

By

Published : Dec 29, 2020, 3:36 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో రైతు కోసం తెదేపా పాదయాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తాళ్ల బురిడి కూడలి నుంచి లచ్చి రాజుపేట గ్రామం వరకు నినాదాలు చేస్తూ.. పాదయాత్ర చేశారు. రైతులను కలిసి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. రైతులు నాయకులకు వివరించారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన.. కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఇబ్బంది పడుతున్నారని.. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేసి సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకొనేలా చూడాలని డిమాండ్ చేశారు

ABOUT THE AUTHOR

...view details