విజయనగరం నగరపాలక సంస్థలో వార్డులకు పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున... తెదేపా ప్రచారం ప్రారంభించింది. తెదేపా జిల్లా కార్యదర్శి, ఐవీపీ రాజు, విజయనగరం నియోజకవర్గ బాధ్యురాలు అదితి గజపతిరాజు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. నగరంలోని 1, 13వ డివిజన్లో మొదటి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టిన.. తెదేపా మేయర్ అభ్యర్థి శమంతకమణి, డివిజన్ అభ్యర్థి చందక స్వప్న ఓట్ల కోసం అభ్యర్థించారు.
విజయనగరంలో పురపోరుకు ప్రచారం ప్రారంభించిన తెదేపా - విజయనగరం నగరపాలక సంస్థ
పురపోరులో భాగంగా విజయనగరంలో తెదేపా ప్రచారం ప్రారంభించింది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా.. నగరంలోని 1,13వ డివిజన్లో మొదటి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టిన అభ్యర్థులు.. ఓట్ల కోసం అభ్యర్థించారు.
విజయనగరంలో తెదేపా ప్రచారం