ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉన్న ఒక్క గ్రీన్ జోన్ జిల్లానూ రెడ్ జోన్ చేస్తారా!'

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్న ఒక్క గ్రీన్ జోన్ జిల్లానూ.. ప్రభుత్వం మద్యం అమ్మకాలతో రెడ్ జోన్​లా మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

tdp mlc sandhya rani criticises ycp government
తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి

By

Published : May 4, 2020, 8:18 PM IST

విజయనగరం జిల్లా ఒక్క కరోనా కేసు లేకుండా గ్రీన్ జోన్​లో ఉందని.. ఇప్పుడు మద్యం అమ్మకాలతో జనం గుంపులుగా చేరడం వలన వైరస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. తెదేపా ఎమ్మెల్సీ సంధ్యా రాణి అన్నారు. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవడం వలన జనసందోహం పెరిగి వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో వైకాపాకు ప్రజలు 9 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. గ్రీన్ జోన్​గా ఉన్న జిల్లాను ప్రభుత్వం చేజేతులా రెడ్ జోన్​గా మారేలా చేస్తోందని ఆరోపించారు. ఇంతకుముందు బయటకు రావడానికి సాకులు వెతుక్కునే ప్రజలు.. ఇప్పుడు ధైర్యంగా మద్యం దుకాణాలకు వెళ్తున్నామని చెప్పేలా చేశారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు మూసివేసి జిల్లాను గ్రీన్ జోన్​గానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details