ద్రవ్య వినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విజయనగరం జిల్లా సాలూరులో సమావేశం నిర్వహించిన ఆమె.. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని తెలుగు దేశం డిమాండ్ చేస్తున్నా.. అధికార పార్టీ సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
'ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకుండా వైకాపా కుట్ర'
ద్రవ్య వినిమయ బిల్లు ఆగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి ఆన్నారు. ఈ బిల్లు పాస్ కాకుండా వైకాపా కుట్ర చేసిందని విజయనగరం జిల్లా సాలూరులో ఆమె ఆరోపించారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సంధ్యారాణీ
సభలో జరిగిన పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని ఆమె అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకుండా వైకాపా కుట్ర చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా నివారణకు చర్యలు తీసుకోకుండా.. రాజధానిని తరలించడమే పనిగా అధికార పార్టీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి.