విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో నియోజకవర్గ తెదేపా నాయకులతో కలిసి ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5000 నగదు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని.... చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని దీక్ష చేపట్టినట్లు తెలిపారు. వరి, మొక్కజొన్న, పచ్చిమిర్చి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఆశా వర్కర్లు, పత్రిక విలేకరులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని కోరారు.
పేదలకు ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్సీ దీక్ష - ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి దీక్ష న్యూస్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి రూ.5000 నగదును ఆర్థిక సహాయంగా అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి దీక్ష చేపట్టారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఆశా వర్కర్లు, పత్రిక విలేకరులకు పీపీఈ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్సీ దీక్ష