ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డాక్టర్​పై దాడిని ఖండించిన దళిత సంఘాలు - tdp policitics in vizinangaram dst

విశాఖలో డాక్టర్ సుధాకర్ పై దాడిని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఖండించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నల్లరిబ్బన్లు కళ్లకు కట్టుకొని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు

tdp members protest at vizinangaram about attack against tdp member in visakha
tdp members protest at vizinangaram about attack against tdp member in visakha

By

Published : May 17, 2020, 4:35 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో దళిత నాయకులు నల్ల రిబ్బన్ కళ్లకు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. విశాఖలో వైద్యుడు సుధాకర్ పై దాడిని ఖండిస్తున్నట్లు మాజీఎమ్మెల్యే చిరంజీవులు పేర్కొన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషిచేయాలని సూచించారు. సుధాకర్ పై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details