విజయనగరం జిల్లా తోటపల్లి కాలువ పెండింగ్ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని తెదేపా నేత కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. తెదేపా శ్రేణులతో కలిసి చీపురుపల్లి మండలం రెడ్డిపేట వద్ద పెనుబర్తి జంక్షన్ వద్ద తోటపల్లి కాలువను సందర్శించారు. తెదేపా హయంలో 90 శాతం మేర పనులు పూర్తయ్యాయన్నారు. ప్రధాన కాలువ పూడిక తీయించి కాలువపై లైనింగ్ చేసేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
'తోటపల్లి కాలువ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవో రద్దు చేయాలి' - తోటపల్లి కాలువ పెండింగ్ పనులు
తోటపల్లి కాలువ పెండింగ్ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని తెదేపా నేత కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. ప్రధాన కాలువ పూడిక తీయించి కాలువపై లైనింగ్ చేసేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
!['తోటపల్లి కాలువ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవో రద్దు చేయాలి' 'తోటపల్లి కాలువ పెండింగ్ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవోను రద్దు చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9617678-99-9617678-1605960462614.jpg)
'తోటపల్లి కాలువ పెండింగ్ పనుల నిలుపుదలపై ఇచ్చిన జీవోను రద్దు చేయాలి'