విజయనగరం జిల్లా రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి ఘటనలో అరెస్టైన తెదేపా నేతలు బెయిల్ పై విడుదలయ్యారు. స్థానిక సబ్ జైలు నుంచి విడుదలైన వీరికి తెదేపా విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధితిగజపతి రాజుతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. రామతీర్థం విగ్రహ ధ్వంసం కేసులో నిందితులను అరెస్ట్ చేయలేక.. అమాయక కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారంటూ తెదేపా నేతలు ఆరోపించారు.
విజయసాయిరెడ్డిపై దాడి కేసులో అరెస్టైన తెదేపా నేతల విడుదల - విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అధితిగజపతి రాజు తాజా వార్తలు
ఎంపీ విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి కేసులో అరెస్టైన తెదేపా నేతలు విజయనగరం జైలు నుంచి విడుదలయ్యారు. వారికి తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
విజయసాయి రెడ్డి దాడి కేసులో అరెస్టైన తెదేపా నేతల విడుదల