అమరావతి రాజధానికి మద్దతుగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా నాయకులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆ పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ వికేంద్రీకరణ పేరుతో అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పరిపాలన అంతా అమరావతి నుంచి సాగిస్తూ అక్కడ రాజధాని వద్దనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకుని ఒకే రాజధాని ముద్దు అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.
'మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు' - విజయనగరం తాజా వార్తలు
మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ అమరావతి రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్ వికేంద్రీకరణ పేరుతో అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకుని ఒకే రాజధాని ముద్దు అనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.
మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు