ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ధరలు పెంచుతున్నా.. ఫించన్లు పెంచరా?' - latest news in vijayanagaram district

నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న తీరుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని తెదేపా నేతలు నిరసనకు దిగారు. ధరలను ప్రభుత్వం అదుపు చేయాలని డిమాండ్ చేశారు.

TDP leaders protest
తెదేపా నేతల నిరసన

By

Published : Aug 7, 2021, 12:51 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో విఫలమైందని చిరంజీవి ఆరోపించారు.

ఇంధన ధరలు సామాన్యులపై మరింత ఆర్థిక భారం మోపుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ధరలు పెంచుతున్న సీఎం జగన్​ పింఛన్లు మాత్రం పెంచటం లేదని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రభుత్వ ఆలోచనలు మారేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి..'అదితి వల్ల ఇండియా గోల్ఫ్​ నేర్చుకుంటుంది'

ABOUT THE AUTHOR

...view details