విజయనగరంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఆధ్వర్యంలో నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ-పాలన కేంద్రీకరణ జరగాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విడగొట్టారన్నారు. ప్రజలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని.. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు పోరాడుతామని తెలిపారు. ఇప్పటికైనా సీఎం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో తెదేపా నేతల నిరసన ర్యాలీ - తెదేపా విజయనగరం జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు
మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ విజయనగరంలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఆధ్వర్యంలో అశోక్ బంగ్లా నుంచి మయూరి కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
![విజయనగరంలో తెదేపా నేతల నిరసన ర్యాలీ tdp-leaders-protest-for-capital-city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5786264-432-5786264-1579599625320.jpg)
విజయనగరంలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ