విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ మార్పు వ్యవహారంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్టు ఛైర్మన్ గా తాజాగా బాధ్యతలు చేపట్టిన సంచైత గజపతిరాజు నియమకాన్ని వ్యతిరేకిస్తూ.. తెదేపా శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఎన్టీఆర్ కూడలి నుంచి మాన్సాస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెదేపా జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు, మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పీవీజీ రాజు, ఆనందగజపతిరాజు విగ్రహలకు పూలమాలలు వేసి ఆందోళన చేశారు.
సంచైత నియామకాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నేతల ఆందోళన - vijayanagaram mansas trust
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా సంచైత గజపతిరాజు నియామకాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ట్రస్టు పేరును భ్రష్టు పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి జీవోలు జారీ చేసిందని ఆరోపించారు.
సంచైత నియామకాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా నేతల ఆందోళన
మాన్సాస్ ట్రస్టు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, వాటి సేవల ద్వారానే విజయనగరం విద్యా నగరంగా ప్రఖ్యాతి పొందిందన్నారు. అలాంటి వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకే, ప్రభుత్వం చీకటి జీవోలు జారీ చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.