తెదేపా బీసీ నేతలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని.. విజయనగరం పట్టణ తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో బీసీలకు పెద్ద పీట వేశారని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాలనలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
'ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది' - vizianagaram latest news
వైకాపా ప్రభుత్వం బీసీలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని విజయనగరంలో తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరంలో తెదేపా నేతల సమావేశం