విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు. మండలంలోని వెంకటరాయుడు పేట గ్రామానికి చెందిన అర్హులకు ఇళ్ల స్థలాల మంజూరులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని ఆర్డీవోకు ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వివరించారు ముఖ్యమంత్రి చెబుతున్న ప్రకారం అధికారులు, వాలంటీర్లు పని చేయడం లేదని వారు ఆరోపించారు. పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.
ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన తెదేపా నేతలు - vizianagaram today latest news
ప్రభుత్వం చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కోరారు. పార్వతీపురంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు.
Breaking News